by Pakka Real Estate -- September 07, 2025 in Plots For Sale
మిస్ చేసుకుంటే బాధపడడం ఖాయం.. పూర్తి వివరాలు ఇవే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో షాద్‌నగర్ ఒక ముఖ్యమైన పెట్టుబడి కేంద్రంగా మారిందని ఇటీవల కొంతమంది రియల్ ఎస్టేట్ నిపుణులు తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో శరవేగంగా జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, పలు అంతర్జాతీయ సంస్థల రాకతో ఇక్కడ భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఇందులో భాగంగానే షాద్‌నగర్‌లోని అత్యంత కీలకమైన ప్రాంతంలో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆమోదం పొందిన "సమన్వయ టౌన్ షిప్" ప్రాజెక్ట్ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.
ఈ ప్రాజెక్ట్ 67 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో రూపొందించారు. ఇందులో 600కు పైగా విల్లా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయ్. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కావడంతో, నివాసితులకు అద్భుతమైన సౌకర్యాలను అందిస్తోంది. ప్రాజెక్ట్‌లో 2 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన క్లబ్‌హౌస్, ఒక దేవాలయం, పార్కులు, పిల్లల ఆట స్థలాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే అంతర్గత రోడ్లు చాలా విశాలంగా, 33 అడుగుల నుంచి 60 అడుగుల వరకు సిమెంట్ కాంక్రీట్ (CC)తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రతి ప్లాట్‌కు బోర్డులను ఏర్పాటు చేయడం, మొత్తం ప్రాజెక్ట్‌కు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండటం ఈ ప్రాజెక్ట్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. నివాసితుల భద్రత కోసం 24/7 సెక్యూరిటీ క్యాబిన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా అందుబాటులో ఉంచారు.
ఈ ప్రాజెక్ట్‌లో 267 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల వరకు వివిధ పరిమాణాలలో ప్లాట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక చదరపు గజానికి ధర రూ. 20,999గా ధరను నిర్ణయించారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్‌లోని ప్లాట్లకు అన్ని బ్యాంకుల నుంచి రుణ సదుపాయం లభించడం.. అంతేకాకుండా, స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది. దీంతో వెంటనే కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ప్రక్రియ ఎంతగానో సహాయపడుతుంది.
"సమన్వయ టౌన్ షిప్" ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణ దాని వ్యూహాత్మక స్థానంగా భావించవచ్చు. ఇది షాద్‌నగర్ టౌన్‌కు కేవలం 2 నిమిషాల దూరంలో ఉంటుంది. అలాగే సమీపంలో నిర్మిస్తున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 5 నిమిషాల దూరంలో ఉంది. దీంతోపాటు, ఇది హైదరాబాద్-బెంగుళూరు NH 44కి 10 నిమిషాలు, రీజనల్ రింగ్ రోడ్ (RRR)కి 15 నిమిషాల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాంతం అద్భుతమైన వాతావరణం, సుందరమైన పరిసరాలతో పెట్టుబడికి అనుకూలంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ 100 శాతం క్లియర్ టైటిల్‌తో ఉండడం మరో ముఖ్యమైన సానుకూల అంశంగా భావించవచ్చు. మరిన్ని విషయాలకు మరియు సైట్ విసిట్ & బుకింగ్స్ కోసం ఈ క్రింది నెంబర్ ని సంప్రదించండి. Phone : 70132 94002