Nov
15
2023
Wednesday
4
40
57
PM
Breaking News

by Pakka Real Estate -- November 18, 2023 in Projects

ఆయన పేరు సక్సెస్‌కు చిరునామా
Lavoura Group Chairman Cheruku Karan Reddy

ఆయన పేరు సక్సెస్‌కు చిరునామా... ఏ రంగంలో అడుగుపెట్టినా విజయమే.. చేసే పని పట్ల నిబద్ధత, అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు విశ్రమించని నైజం, సమస్యలను అలవోకగా అధిగమించే చాకచక్యం ఉద్యోగులను తన సొంత కుటుంబసభ్యులుగా చూసుకునే మంచితనం ఒక్కడిగా ఎదిగినా తనతో పాటు వందలాది మంది ఎదుగుదలకు చేయూతనిచ్చే అరుదైన వ్యక్తిత్వం.. ఆయన సొంతం ఆయనే సక్సెస్‌కు బ్రాండ్ అంబాసిడర్ యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ లీడర్ శ్రీ చెరుకు కరణ్ రెడ్డి గారు.

ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు... మీడియా, అడ్వర్‌టైజింగ్ రంగంలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కరణ్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన ఏడాదిలోనే సక్సెస్‌పుల్ రియల్ బిజినెస్ లీడర్‌గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. తెలివైన పెట్టుబడికి చిరునామా స్లోగన్ తో అడుగుపెట్టిన కొద్ది నెలల్లోనే కస్టమర్ల నమ్మకానికి మారుపేరుగా వరుస వెంచర్లతో దూసుకువెళుతున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా  గ్రూపు బాధ్యతలను శ్రీ చెరుకు కరణ్ రెడ్డి గారు  సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున అంటే 2022, సెప్టెంబర్ 22న చేపట్టారు. మీడియా, అడ్వర్‌టైజింగ్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న చెరుకు కరణ్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ రంగంలో  కూడా తన మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో లావోరా గ్రూపును సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళుతున్నారు.

చార్జ్ తీసుకున్న కొద్దిరోజులకే  శ్రీశైలం హైవే, మహేశ్వరంలో 14 ఎకరాల్లో  లావోరా హిల్ సైడ్ ప్రాజెక్టును సక్సెస్ చేసిన కరణ్ రెడ్డి గారు ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.. 2023, ఫిబ్రవరి 23న షాద్ నగర్ వద్ద  10 ఎకరాల్లో లావోరా హైవే ప్రైడ్ అనే వెంచర్‌ను  గ్రాండ్ లాంచ్ చేయించారు. ఆ వెంటనే ఏప్రిల్ 2 న  ఫార్మాసిటీ వద్ద  255  ఎకరాల్లో అతిపెద్ద లావోరా మెర్క్యురీ టౌన్‌షిప్‌ను కూడా విజయవంతంగా ప్రారంభించారు. కరణ్ రెడ్డిగారిలోని లీడర్‌షిప్ కేపబిలిటీస్‌ను గమనించిన లావోరో గ్రూపు యాజమాన్యం. అదే నెలలో ఏప్రిల్ 25న ఆయనకు ఛైర్మన్‌గా పదవీబాధ్యతలు అప్పగించింది. ఛైర్మన్ కరణ్ రెడ్డి గారి నాయకత్వంలో లావోరో గ్రూపు కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంటూ వరుస వెంచర్లతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో జైత్రయాత్ర మొదలుపెట్టింది.

అప్పటికే సంస్థలో  ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో  ఎదురయ్యే ఛాలెంజెస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సమాంతరంగా వరుస ప్రాజెక్టులను స్టార్ట్ చేయిస్తూ హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగంలో లావోరా గ్రూపు పేరు మార్మోగేలా చేసిన ఘనత కరణ్ రెడ్డి గారికే దక్కింది. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఏడాది మే 18న శ్రీశైలం హైవేపై కందుకూరు వద్ద 16 ఎకరాల్లో లావోరా లోటస్ ఫార్మ్ వెంచర్‌ను సక్సెస్ చేసిన కరణ్ రెడ్డి.గారు.. ఆ వెంటనే జూలై 2న, 32 ఎకరాల్లో విస్తరించిన శ్రీశైలం హైవేలోనే మైసిగండి మైసమ్మ టెంపుల్ వద్ద లావోరా కూర్గ్ ఎస్టేట్స్ వెంచర్‌ను  గ్రాండ్‌గా  లాంచ్ చేశారు.

మళ్లీ 10 రోజులు కూడా తిరగకముందే జూలై 12 న చేవెళ్లకు సమీపంలోని న్యాలట వద్ద 350 ఎకరాల్లో లావోరా వనం ప్రాజెక్టును స్టార్ట్ చేసిన కరణ్ రెడ్డిగారు, నెల రోజుల్లోనే ఆగస్టు 11న  శ్రీశైలం హైవే, ముచ్చర్ల వద్ద Lavoura Amber Homes ప్రాజెక్టును కూడా ప్రారంభించి రియల్ ఎస్టేట్ రంగంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఛైర్మన్ కరణ్ రెడ్డి గారి సారథ్యంలో శ్రీశైలం హైవేలో శంషాబాద్, షాద్ నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో దాదాపు 12 ప్రెస్టీజియస్  వెంచర్స్‌తో  దూసుకువెళుతున్న లావోరా గ్రూపు   హైదరాబాద్‌ నగరంలో టాప్ 10 రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటిగా నిలవడం విశేషం.

ఇక  2022, డిసెంబర్ 23న 15 మంది మార్కెటింగ్ లీడర్లతో  ఏర్పడిన లావోరా రియల్ ఎస్టేట్ గ్రూపు బోర్డు..కరణ్ రెడ్డిగారి ఆధ్వర్యంలో డిసెంబర్ 28న ఫస్ట్ బోర్డు మీటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం 40 మంది డైరెక్టర్లతో సాగుతున్న బోర్డును 100 మందికి పైగా డైరెక్టర్లతో రియల్ ఎస్టేట్ రంగంలోనే అతిపెద్ద బోర్డుగా చేయాలనే లక్ష్యంతో కరణ్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఓవైపు బోర్డును సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు సమాంతరంగా 12 మందితో కేఫ్ డిమో పేరుతో సెకండ్ లెవెల్ మేనేజ్‌మెంట్ గ్రూపును ప్రారంభించారు.

ఇలా సంస్థలో బోర్డు స్థాయి నుంచి టీమ్ లీడర్లు, మార్కెటింగ్ ఏజెంట్ల వరకు పక్కాగా ఓ వ్యవస్థను క్రియేట్ చేశారు.  మొత్తంగా వరుస వెంచర్లతో లావోరా గ్రూపును విస్తరిస్తూ..కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటూనే మరో పక్క బోర్డు మెంబర్ల నుంచి క్రమశిక్షణ, సమర్థత కలిగిన ఆఫీసు స్టాఫ్, చురుకైన మార్కెటింగ్ సిబ్బంది వరకు అందరిని కుటుంబసభ్యుల్లాగా చూసుకుంటూ..  రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్న  మోస్ట్ సక్సెస్‌ఫుల్ యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ లీడర్  శ్రీ చెరకు కరణ్ రెడ్డి గారికి ఇవే మా హార్థిక శుభాకాంక్షలు.

Real Estate Videos

Chat