Nov
15
2023
Wednesday
4
40
57
PM
Breaking News

by Pakka Real Estate -- August 10, 2026 in Real Estate News

మీ ఆస్తి మీదేనా? హైదరాబాద్ ప్రాపర్టీ ఓనర్లకు ఊహించని షాక్!
What is GHMC 22A in Telangana ?

భాగ్యనగరంలో సొంత ఇల్లు ఉందనో.. లేదా ఇటీవల కొనుగోలు చేసిన ప్లాట్ ఉందనో ధీమాగా ఉన్నారా? అయితే, మీ కష్టార్జితమైన ఆస్తి భద్రతపై తక్షణమే దృష్టి సారించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ప్రస్తుతం అత్యంత కలవరపరిచే వాతావరణం నెలకొంది. బాధితులు కష్టపడి సంపాదించిన సొమ్ముతో, అన్ని చట్టబద్ధమైన పత్రాలు చూసుకొని కొనుగోలు చేసిన వేలాది ఆస్తులు రాత్రికి రాత్రే రెవెన్యూ రికార్డుల్లో 22A నిబంధన కింద నిషేధిత జాబితాలోకి చేరిపోతున్నాయి. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 70,000 నుంచి 90,000 ఆస్తులను రెవెన్యూ అధికారులు నిషేధిత (22A) జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. తమ పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు లేదా అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఇళ్లను, ప్లాట్లను విక్రయించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లిన ఆస్తిదారులకు అక్కడ తీవ్ర నిరాశ ఎదురవుతోంది... మీ ఆస్తి 22A నిషేధిత జాబితాలో ఉంది.. దీనికి రిజిస్ట్రేషన్ లేదా లీజ్ డీడ్ చేయడం కుదరదు.. అని సబ్-రిజిస్ట్రార్లు చేతులెత్తేస్తుండటంతో సామాన్యులు విస్తుపోతున్నారు. 

ఎలాంటి ముందస్తు నోటీసులు లేదా ప్రకటనలు లేకుండానే.. 22A Clause 1(D) లోని ULC, సర్కారీ భూముల విభాగంలో లేదా 22A Sub-class 1 (A, B, C) విభాగాల్లో ఈ ఆస్తులను నమోదు చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ గందరగోళం కేవలం కొత్తగా వెలిసిన వెంచర్లకు మాత్రమే పరిమితం కాలేదు. దాదాపు 50 ఏళ్ల క్రితమే సేల్ డీడ్ల ద్వారా కొనుగోలు చేసి.. సొసైటీల ద్వారా ఇళ్లు నిర్మించుకున్న పాత ఆస్తులు కూడా ఇప్పుడు ప్రొఫెషనరీ జాబితాలో దర్శనమిస్తున్నాయి. 

నగరంలోని అత్యంత కీలకమైన, VIP ప్రాంతాలైన సనత్ నగర్, యూసఫ్ గూడా, అమీర్ పేట్, ఎస్.ఆర్. నగర్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఖైరతాబాద్, బంజారాహిల్స్, ఫిలింనగర్, ఎమ్‌ఎల్‌ఏ కాలనీ, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లోని వేలాది ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చినట్లు సమాచారం. 

ఐదు పదుల కాలంగా క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తూ.. బ్యాంకు రుణాలు తీరుస్తూ జీవిస్తున్న తమ ఆస్తులు బ్లాక్‌లిస్ట్‌లోకి ఎలా వెళ్లాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే .. ఇది మా పరిధిలో లేదు, కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లండి అని దాటవేస్తుండటంతో వేలాది మంది కలెక్టరేట్లకు క్యూ కడుతున్నారు. ప్రజావాణి కార్యక్రమాల్లో వందలాది ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ.. అధికారుల నుంచి స్పష్టమైన హామీలు లభించడం లేదు. 

ఇప్పటికే నగరంలో హైడ్రా కూల్చివేతల భయంతో ఉన్న ప్రజలకు.. ఈ 22A నిషేధిత జాబితా రగడ కోలుకోలేని దెబ్బగా మారింది.  మీ ఆస్తి కూడా ఈ జాబితాలో ఉందో లేదో వెంటనే తెలంగాణ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో సర్వే నంబర్ల ద్వారా తనిఖీ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Real Estate News

Flats For Sale

Plots For Sale

Real Estate Videos

Related News

Trending News

Related Real Estate Videos

Chat