Nov
15
2023
Wednesday
4
40
57
PM
Breaking News

by Pakka Real Estate -- February 23, 2024 in Real Estate News

కర్టెన్ రైజర్ వేడుకలో AFM Properties ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ ట్రోఫీ లాంచ్
AFM Properties Presents the Launch of Gama Awards Curtain Raiser Ceremony

దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్  గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ వేడుక నిర్వహించనున్నారు. ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. శుక్రవారం ఈ వేడుకకు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి,  జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత డీ వీ వీ దానయ్య, దర్శకులు సాయి రాజేష్, ప్రసన్న,  హీరోయిన్ డింపుల్ హయతి,గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ కలిసి ఈ అవార్డుకు సంబంధించి ట్రోఫీను లాంచ్ చేశారు. 

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. "గతంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గామా అవార్డ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మధ్యలో మూడేళ్ల పాటు కోవిడ్ తో పాటు ఇతర కారణాలతో కేసరి త్రిమూర్తులు గారు ఈ వేడుకను నిర్వహించలేకపోయారు. కానీ ఈసారి టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించబోతున్నారు. 2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలనుంచి - బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్, వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ అందజేయనున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు" అని చెప్పారు. 

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు సుకుమార్,  బాబీ,  బుచ్చిబాబు సానా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్,  సంగీత దర్శకులు, దేవి శ్రీ ప్రసాద్,  ఎస్ ఎస్ తమన్, ఎం ఎం శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్,  గాయకులు మనో, ధనుంజయ్..  ఇంకా ఎందరో సినీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, గాయనీ గాయకులు, కమెడియన్లు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.

Real Estate News

Real Estate Videos

Related News

Trending News

Related Real Estate Videos

Read More

Chat