by Pakka Real Estate -- April 19, 2026 in Real Estate News
REAL ESTATE NEWS : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రాంపల్లి గ్రామం, దయానంద నగర్ ఆఫీసర్స్ కాలనీలో ఉన్న ప్లాట్ నెం. 235 (సర్వే నంబర్లు 263/పార్ట్ & 264, విస్తీర్ణం 200 చదరపు గజాలు) పై ఒక పెద్ద స్థాయి రియల్ ఎస్టేట్ మోసం కేసు నమోదు చేయబడింది.
అట్టి ప్లాట్ కి అసలైన ఓనర్ గంగాధర వీరయ్య కాగా అతను ఆమె కూతురు లీలావతి కి గిఫ్ట్ డీడ్ ఇచ్చినాడు. కానీ వీరయ్య తన ఒరిజినల్ డాక్యుమెంట్ పోగొట్టుకొని పోవడం తో, తుకారం గేటు పి యస్ పిర్యాదు చేసినాడు. తరువాత లీలావతి తేది: 29.03.2022 న శ్రీ గంగి మల్లేష్ కి అమ్మగా, ఆ స్థలంపై ఆయన కాంపౌండ్ వాల్ నిర్మించి తన ఆధీనంలో ఉంచుకున్నారు. కానీ గంగి మల్లేష్ ఆ ప్లాట్ కి సంబంధించి బెదిరింపు కాల్ రావడం తో గంగి మల్లేష్ కీసర పోలీస్ స్టేషన్ లొ పిర్యాదు చెయ్యగా, కేసు నమోదు అయినది.
ఈ కేసులో తక్కువ సమయం లొ ఎక్కువ డబ్బులు సంపాదించాలని, ప్రధాన నిందితుడు నాంపల్లి ప్రభాకర్ రెడ్డి (A1) కి వీరయ్య యొక్క ఒరిజినల్ ప్లాట్ పేపర్ లు లభించడం తో, తన సహచరులతో గుడిబాటి రమేష్ రెడ్డి (A3), తుమ్మల మధుకర్ రెడ్డి (A4) కలిసి అసలు యజమాని గంగాధర వీరయ్య కి బదులు మరో వ్యక్తిని (A2) నచ్చు రామస్వామి ని అసలైన ఓనర్ గా చూపించి, ఆ ప్లాట్ ని గుడిబాటి రమేష్ రెడ్డి (A3), 2004 లో నఖిలీ రిజిస్ట్రేషన్ చేయించినారు. అనంతరం ఆ నకిలీ పత్రాల ఆధారంగా పలువురికి భూమిని విక్రయిస్తూ డబ్బులు సంపాదించినారు.
ఈ కేసులో A1 నాంపల్లి ప్రభాకర్ రెడ్డి, A3 గుడిబాటి రమేష్ రెడ్డి, A4 తుమ్మల మధుకర్ రెడ్డి లను 17.04.2026 న అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరచడం జరిగింది. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసు పై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు.
పోలీసులు ప్రజలకు హెచ్చరిక :
• భూమి కొనుగోలు చేసే ముందు అసలు పత్రాలను పూర్తిగా పరిశీలించాలి
• పాత రిజిస్ట్రేషన్లు, యజమాని వివరాలు ధృవీకరించాలి
• డూప్లికేట్ లేదా అనుమానాస్పద డాక్యుమెంట్లపై జాగ్రత్తగా ఉండాలి
• అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
ఇట్లు
PRO
Malkajgiri Police Commissionerate