by Pakka Real Estate -- April 02, 2026 in Real Estate News
Bharat Future City : FCDA కార్యాలయాన్ని సందర్చించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU)కి సంబంధించిన భవన సముదాయాల నిర్మాణ పురోగతిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు.
ఫ్యూచర్ సిటీ అథారిటీ భవన నిర్మాణ పనులతో పాటు ఆ ప్రాంత రూపకల్పనలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే, స్కిల్స్ యూనివర్సిటీకి చెందిన పలు భవనాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి గారి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు గారు, ఇతర అధికారులు ఉన్నారు.