by Pakka Real Estate -- September 30, 2024 in Real Estate News
నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్ది కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. తక్కువ జీతమయిన ఏ చీకుచింత లేకుండా బతికేయొచ్చు అని పట్టణాలకు వలస వచ్చిన ప్రజలు ఇప్పుడు అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలలో అద్దలు చుక్కలను అంటుతున్నాయి. మధ్యతరగతి కుటుంబానికి ఇంటి బాడుగ కట్టడం పెద్ద సవాలుగా మారుతుంది.
హైదరాబాదులో గత మూడేళ్ల వ్యవధిలో ఎప్పుడూ లేనంతగా నివాస గృహాల ధరలు ,అద్దెలు భారీగా పెరిగిపోయాయి. గతంలో దక్షిణాదిలో చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో ఎక్కువగా మల్టీ నేషనల్ కంపెనీలు ఉండేవి. అయితే ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ అయిన తర్వాత నుంచి క్రమంగా మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాదులో ఎక్కువైపోయాయి. దీని ప్రభావంతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.
దీని ప్రభావం ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ ఫేసులతో పాటుగా రెసిడెన్షియల్ సెగ్మెంట్ల పైన కూడా పడినట్టయింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ మార్కెట్, రెసిడెన్షియల్ డిమాండ్, ఆఫీస్ స్పేస్ డిమాండ్ లాంటి వాటిపై చోటు చేసుకున్న మార్పుల ఆధారంగా అనరాక్ అనే అనే సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. బెంగళూరు, ముంబై, చెన్నై, పూణే, కోల్కత్తా, హైదరాబాద్ లాంటి మహా నగరాల నుంచి సేకరించిన డేటాతో ఈ సర్వే నివేదికను తయారు చేశారు.
ఈ సర్వే ప్రకారం అద్దె పెరుగుదలలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. మిగిలిన నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో 33 శాతం మేర అద్దె రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ లిస్టులో గచ్చిబౌలి అగ్రస్థానంలో నిలువగా కొండాపూర్ రెండవ స్థానంలో నిలుస్తోంది. 2020లో గచ్చిబౌలిలో ఒక చదరపు అడుగు అడ్డ విలువ 4790 రూపాయలు ఉండేది అయితే ఈ సంవత్సరం అది 6365 రూపాయలకు చేరింది.
పైగా ఇంతకుముందు దొరికినంత సులభంగా ఇప్పుడు ఇల్లు అద్దెకు దొరకడం లేదు. అంతకుముందు అన్ని రిపేర్లు చేయించి అద్దకు ఇచ్చేవారు. డిమాండ్ పెరగడంతో మెయింటెనెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆఫీస్ కి దగ్గరగా ఇల్లు తీసుకోవాలి అంటే జీవితంలో సగం మాయమైనట్లే అంటున్నారు ఉద్యోగస్తులు. భారీ అద్దాలు చెల్లించలేక.. గంటలకొద్దీ ప్రయాణాలు చేస్తున్నారు.