by Pakka Real Estate -- May 18, 2024 in Real Estate News
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ సారి ఓటింగ్ శాతం కూడా పెరిగింది. కొన్ని సర్వే సంస్థలు టీడీపీ అధికారంలోకి వస్తుందని, మరికొన్ని సర్వేలు జగన్ మళ్ళీ సీఎం అవుతాడని, మరి కొంతమంది ఏ పార్టీ విజయం సాధిస్తుందో చెప్పలేము అని, ఇలా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు మేమే అధికారంలోకి వస్తామని, సీఎం జగన్ ఐతే మా పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పుకుంటున్నారు.
ఐతే ఇక్కడ విషయం ఏమిటంటే ఏపీ లో చంద్రబాబు సీఎం ఐతే తెలంగాణాలో భూముల ధరలు తగ్గుతాయా అన్నది అసలైన పాయింట్. చంద్రబాబు సీఎం ఐతే తన 40 సంత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తాడు అని అనుకుంటున్నారు. ఈ కారణంతో తెలంగాణలోని పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే భూమిపై పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు కూడా ఎలక్షన్స్ ఫలితాల తరువాత తెలంగాణాలో భూముల ధరలు తగ్గుతాయి అప్పుడు కొందామని ఆగారు.
ఐతే ఇది ఎంతవరకు నిజం ? నిజంగా ఏపీ లో చంద్రబాబు సీఎం ఐతే తెలంగాణాలో భూముల ధరలు తగ్గుతాయా ? అని అంటే సీనియర్ రియల్ ఎస్టేట్ విశ్లేషకులు ఏమంటున్నారు అంటే ? ఆల్రెడీ తెలంగాణాలో రియల్ ఎస్టేట్ భూం హై స్టేజ్ లో ఉందని. తెలంగాణాలో కెసిఆర్ సీఎం అయ్యాక 10 రూపాయలుది 100 రూపాయలు అయిందని, హై స్ప్పేడ్ లో ఉన్న తెలంగాణ భూముల ధరలు తగ్గడం చాల కష్టం అని, ఒక ఆరు నెలలు భూముల ధరలు హెచ్చు తగ్గుదలలు లేకుండా స్థిరంగా ఉంటాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఫలితాల ప్రభావం తెలంగాణాలో ఎలా ఉంటుందో వేచి చూద్దాం. దయచేసి మీ కామెంట్స్ ని తెలియచేయండి.