by Pakka Real Estate -- November 24, 2023 in Real Estate News
తెలంగాణ యువకుడికి అరుదైన గౌరవం
తెలంగాణ యువకుడికి అత్యంత అరుదైన అంతర్జాతీయ పురస్కారం లభించింది.. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ఒక కంపెనీకి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు గానూ తెలంగాణకు చెందిన సురేష్ సంపంగి కి ఈ అవార్డు లభించింది. థాయిలాండ్ లో జరిగిన ఒక అంతర్జాయ వ్యాపార సదస్సులో రాయల్ బ్యాంకాక్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ థారడోల్ థోంగ్రాంగ్ మరియు ఫ్రాన్స్ క్వీన్ ప్రిన్సెస్ ఇసాబెల్ లాఫోర్జ్ సమక్షంలో సురేష్ సంపంగి ఈ అవార్డు స్వీకరించారు.
సురేష్ సంపంగి 28 ఏళ్ల వయసులోనే సంపంగి రియాల్టీ అండ్ ఇన్ఫ్రా కంపెనీకి సీఈవోగా నియమితులయ్యారు. కంపెనీని స్థాపించిన ఏడాదిలోనే 100 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించి తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించారు. రియల్ ఎస్టేట్ అంటే భూములు అమ్మడం కాదనీ, పంట భూముల్లో అరుదైన పంటలు పండించి వాటిని రైతులకు పంచడం అనే సరికొత్త కాన్సెప్ట్ తో సురేష్ సంపంగి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ లో అరుదైన జాతికి చెందిన డేట్స్ పండిస్తూ వాటి లాభాల్ని తమ వెంచర్ లో భూములు కొన్న వారికి పంచుతున్నారు.
సంపంగి రియల్టీ అండ్ ఇన్ఫ్రా కంపెనీ తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్ట్రక్చర్ , బయో ఫార్మింగ్, హాస్పిటాలిటీ, సినీ నిర్మాణం ఇలా అనేక రంగాల్లో విస్తరించింది. మార్కెటింగ్ రంగంలో సుధీర్ఘ అనుభవం ఉన్న సురేష్ సంపంగి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రియల్ ఎస్టేట్ ను రైతుల మధ్య లాభాల పంపిణీ అనే కాన్సెప్ట్ తో సరికొత్త పంథా తొక్కించారు. దాదాపు ఐదు వందల మంది ఉద్యోగులు పని చేస్తున్న ఈ సంస్థ ఛైర్మన్ సంపంగి రమేశ్. గత ఏడాది కంపెనీ ముఖ్య ఉద్యోగులందరికీ ఖరీదైన కార్లు కొనిచ్చి వార్తల్లోకెక్కారు సంపంగి రమేశ్.
ఈ నేపథ్యంలో థాయిలాండ్ దేశపు అత్యున్నత పురస్కారం సంపంగి గ్రూప్ సీఈవో సురేష్ సంపంగిని వరించడం విశేషం. ఇంటర్నేషనల్ అఛీవర్స్ కాన్ఫరెన్స్ అండ్ అవార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకాంక్ లో నవంబర్ 18న సురేష్ సంపంగి ఈ అవార్డు స్వీకరించారు. ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యం - అవకాశాలు అనే అంశంపై అఛీవర్స్ సంస్థ ఈ సదస్సును నిర్వహించింది. ఇందులో ప్రపంచ దేశాల నుంచి పలువురు సుప్రసిద్ధ వ్యాపార వేత్తలు పాల్గొన్నారు. ఈ సదస్సులో మన భారత్ నుంచి పాల్గొన్న సురేష్ సంపంగికి 28 ఏళ్ల ప్రాయంలోనే ఒక అతి పెద్ద సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నందుకు అవార్డు అందజేశారు..వరల్డ్ యంగెస్ట్ ఈసీవోగా ఆ పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు యువకుడు సంపంగి సురేష్ కావడం మరో విశేషం.